క్రేజీగా `మిష‌న్ ఇంపాజిబుల్` సిరీస్ 6వ సినిమా..

Friday, January 26th, 2018, 10:32:33 AM IST

టామ్ క్రూజ్‌కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానుల్ని తెచ్చిపెట్టిన సిరీస్ `మిష‌న్ ఇంపాజిబుల్‌`. అసాధ్యాన్ని సుసాధ్యం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా క‌థానాయ‌కుడి సాహ‌సోపేత‌ ప‌య‌నం ఆస‌క్తి రేకెత్తించేలా చూపించ‌డంలో ఈ సిరీస్ గొప్ప విజ‌యం సాధించింది. భారీ యాక్ష‌న్ .. ఛేజ్‌లు.. గాల్లో పోరాటాలు.. విమానాల పైనుంచి జంపింగులు .. ఒక‌టేమిటి ఎన్నో విన్యాసాలు చేసి చూపించాడు టామ్ క్రూజ్‌. అత‌డి సాహ‌సోపేత‌మైన ఫీట్స్ మ‌రోసారి అభిమానుల‌కు క‌న్నుల పండువ చేయ‌నున్నాయి. మిష‌న్ ఇంపాజిబుల్ సిరీస్‌లో ఇప్ప‌టికే ఐదు సినిమాలొచ్చి ఘ‌న‌విజ‌యం సాధించాయి. ప్ర‌స్తుతం ఆరో చిత్రం తెర‌కెక్కుతోంది ఈ సిరీస్‌లో. అప్ప‌ట్లో ఓ భారీ స్టంట్ చిత్రీక‌ర‌ణ‌లో టామ్ క్రూజ్ కి ప్ర‌మాదం సంభ‌వించింది. అయితే అదృష్ట వ‌శాత్తూ ఆ ప్ర‌మాదం నుంచి బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లు ఈ సినిమాకి టైటిల్ ఏంటి? అన్న‌ది డిసైడ్ కాలేదు.

తాజాగా `మిష‌న్ ఇంపాజిబుల్ -ఫాల్ ఔట్` అనే టైటిల్‌ని ప్ర‌క‌టించించారు మేక‌ర్స్‌. ఆ మేర‌కు అధికారికంగా బ్యాన‌ర్‌ని లాంచ్ చేశారు. మ‌హేష్ ఫేవ‌రెట్ స్టార్ టామ్ క్రూజ్‌. టైటిల్ ఫిక్స్ చేసి రిలీజ్ చేస్తున్నారు కాబ‌ట్టి.. మ‌న సూప‌ర్‌స్టార్‌కి ఇది ఎగ్జ‌యిటింగ్ ఇన్ఫ‌ర్మేష‌న్‌. మ‌హేష్ స్టైల్‌, యాక్ష‌న్‌, డ్రెస్సింగ్ సెన్స్ ప్ర‌తిదానికి టామ్ క్రూజ్‌ని ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుంటాడ‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ చిత్రం రిలీజైతే మ‌హేష్ మ‌స్ట్‌గా వాచ్ చేస్తాడ‌న‌డంలో సందేహం లేదు.