సూప‌ర్‌స్టార్‌లో ఎందుకంత టెన్ష‌న్‌?

Tuesday, April 24th, 2018, 08:56:58 PM IST

`భ‌ర‌త్ అనే నేను` ముందు, భ‌ర‌త్ అనే నేను త‌ర‌వాత‌.. ప్ర‌స్తుతం మ‌హేష్ స‌న్నివేశ‌మిది. ఈ సినిమాకి ముందు
కెరీర్‌లో ఎన్న‌డూ లేనంత టెన్ష‌న్ అనుభ‌వించాడు మ‌హేష్‌. వాస్త‌వానికి `భ‌ర‌త్ అనే నేను` రిలీజ్‌కి వారం ముందు అత‌డు విదేశాల‌కు ఎలాంటి టెన్ష‌న్ లేకుండా జాలీ ట్రిప్ వెళ్లాడ‌నే అనుకున్నారంతా. కానీ అది వ‌ట్టి అబద్ధం అని తేలింది. మ‌హేష్ త‌న ఫ్యామిలీతో విదేశీ ట్రిప్‌ వెళ్ల‌డానికి కార‌ణం అస‌లు త‌ట్టుకోలేని టెన్ష‌నే. ఆ మాట త‌నే స్వ‌యంగా చెప్పాడు. `భ‌ర‌త్ అనే నేను` థాంక్స్ మీట్ లో మ‌హేష్ ప‌డిన టెన్ష‌న్ చూస్తే అవ‌త‌లి వారికి ఆ సంగ‌తి అర్థ‌మైంది. ఇన్నేళ్ల‌లో మ‌హేష్‌ని ఈ రేంజులో టెన్ష‌న్‌తో ఎవ‌రూ చూడ‌లేదు. పైగా అత‌డు మైక్ అందుకుని స్పీచ్ స్టార్ట్ చేసిన‌ప్పుడు ఆ పెద‌వుల్లో ఒక‌టే ఒణుకు. స్వ‌రం ఓకింత షేకైంది. ఇలాంటిది ఇదివ‌ర‌కెన్న‌డూ చూడ‌నిది. అత‌డి మాట తీరులో షివ‌రింగ్ చూశాక .. ఈ స‌క్సెస్ కోసం మ‌హేష్ ఎంత ఓపిగ్గా.. ఎంత ఆత్రంగా ఎదురు చూశాడో అర్థ‌మైంది.

రెండు ద‌శాబ్ధాల పాటు స్టార్ హీరోగా ఇండ‌స్ట్రీని షేక్ చేసిన మ‌హేష్ ఇప్పుడు ఇంత టెన్ష‌న్ ప‌డాలా? అని అంద‌రిలోనూ సందేహం. ఇదే ప్ర‌శ్న మీడియా అడిగితే ఆయ‌న నుంచి వ‌చ్చిన స‌మాధానం అంతే స్ట‌న్నింగ్‌. అస‌లు నేను టెన్షన్ ప‌డుతోంది… డ‌బ్బు సంపాదించ‌డం గురించి కాదు. గ‌త కొంత‌కాలంగా అభిమానుల అంచ‌నాల్ని అందుకోలేక‌పోతున్నానన్న టెన్ష‌న్‌. ఇప్పుడు మైండ్ ఫ్రీ అయ్యింది. టెన్ష‌న్ తీసేసిన‌ట్ట‌యింది.. అంటూ ఎంతో ఉద్వేగంగా చెప్పాడు. ఒక స్టార్ హీరోపై ఈ స్థాయి ఒత్తిడి ఉంటుంద‌న్న‌ది అంద‌రికీ అర్థమైందిలా. మ‌హేష్ ఎంతో రిలాక్స్‌గా ఉన్నారిప్పుడు. ఇదివ‌ర‌కూ ఎన్నో అంచ‌నాలతో రిలీజై తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన `బ్ర‌హ్మాస్త్రం`, `స్పైడ‌ర్‌` ప్ర‌భావం మ‌హేష్‌ని ఎంత‌గా టెన్ష‌న్ పెట్టిందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎలాంటి టెన్ష‌న్ లేదు. రెండోసారి కుటుంబ స‌మేతంగా విదేశాల‌కు వెళ్లేందుకు ప్రిన్స్ రెడీ!!

  •  
  •  
  •  
  •  

Comments