బ్రహ్మోత్సవం చేసి చాలా పెద్ద తప్పు చేశా అంటున్న మహేశ్!

Monday, September 25th, 2017, 12:36:41 PM IST


మహేశ్ బాబు కెరియర్ లో బ్రహ్మోత్సవం సినిమా ఎంత డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చిందో అందరికి తెలిసిందే. మంచి కథాంశంతో తీసిన ఆ సినిమా ప్రేక్షకుడుకి అర్ధం కాకపోవడంతో దారుణంగా తిప్పి కొట్టారు. ఆ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల కెరియర్ కూడా మరల మొదటికి వచ్చింది. అయితే తాజాగా ఆ సినిమా ఫెయిల్యూర్ గురించి సూపర్ స్టార్ మహేశ్ స్పైడర్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తావించారు. ఆ సినిమా ఫెయిల్ అవడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియకపోయినా, ఏదో మంచి విషయం చెప్పాలనుకుంటే ప్రేక్షకులు తిప్పి కొట్టారు అనేది మాత్రం అర్ధమైంది. నిజానికి ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది.

దాని వలన నిర్మాతలు సినిమాని కొన్న వారు భారీగా నష్టపోయారు. కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంటుందో పరిస్థితి నేను అర్ధం చేసుకోగలను, అందుకే ఇకపై వీలైనంత జాగ్రత్తగా సినిమాల ఎంపిక చేసుకుని వెళ్తా. ఇక ఆ సినిమా ఫెయిల్ తర్వాత కాస్తా డిప్రెషన్ ఉన్నమాట వాస్తవమే అయిన ఆ టెన్షన్ కి నా పిల్లలు టానిక్ లా పనిచేస్తారని మహేశ్ చెప్పాడు. మొత్తానికి బ్రహోత్సవం ఫెయిల్ అవడానికి కారణాలు మహేశ్ చెప్పకపోయినా, ఆ సినిమాతో తనకి ఎంత జ్ఞానోదయం అయ్యింది అనే విషయం క్లియర్ చేయడంతో, ఇకపై మహేశ్ చేయబోయే ఎ సినిమా అయిన మినిమమ్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. మరి స్పైడర్ రిజల్ట్ ఎలా ఉంటుందో దానిని బట్టి మహేశ్ మాటలలో స్ట్రెంత్ ఎంతో తెలిసిపోతుంది.

Comments