షాక్ ..మహేష్ 25 టైటిల్ ఫిక్స్ అయిందా ?

Wednesday, July 11th, 2018, 10:48:54 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25 వ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయిందా ? ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ ప్రశ్న హల్చల్ చేస్తుంది .. ఎందుకంటే ఈ సినిమాకు సంబందించిన కొన్ని ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ .. రౌండ్స్ కొడుతున్నాయి. పైగా రాజసం అనే టైటిల్ పెడుతున్నారంటూ రచ్చ చేస్తున్నారు. ఇందులో నిజానిజాలు ఏవైనప్పటికీ ఈ పోస్టర్స్ టైటిల్ మాత్రం మహేష్ అభిమానులను ఆకట్టుకుంటుంది. మహేష్ మొదటి సారి గడ్డం లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు రాజసం టైటిల్ బాగుందంటూ మహేష్ ఫాన్స్ కూడా చెబుతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ ని డెహ్రూడూన్ లో పూర్తీ చేసుకుంది. త్వరలోనే ఈ యూనిట్ అమెరికా వెళ్లనుంది. అక్కడే కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా చిత్రీకరిస్తారట. మహేష్ కెరీర్ లో 25వ సినిమా కాబట్టి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఉగాదికి విడుదల చేస్తారట.

  •  
  •  
  •  
  •  

Comments