మహేష్ 25 అప్పుడే మొదలు పెడతారట ?

Wednesday, January 31st, 2018, 02:01:55 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ అను నేను షూటింగ్ దాదాపు పూర్తీ కావొచ్చింది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. మహేష్ ముఖ్యమంత్రి గా కనిపించే ఈ సినిమా ఏప్రిల్ 27న విడుదల కానుంది. ఇక మహేష్ 25వ చిత్రానికి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించే చిత్రం ఏప్రిల్ లో సెట్స్ పైకి రానుంది. ఇప్పటికే దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా మారాడు. ఈ సినిమా ఎక్కువగా అమెరికాలో జరుగుతుందట. దిల్ రాజు , అశ్విని దత్ లు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే ఫైనల్ అయినట్టు తెలిసింది. మహేష్ కెరీర్ లో ప్రత్యేకంగా ఉండే ఈ సినిమా పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.