రషీద్ కు ఫిదా అయిన మహేష్!

Saturday, May 26th, 2018, 11:43:17 AM IST

నిన్న జరిగిన హైదరాబాద్ వర్సెస్ కోల్ కతా ఐపీఎల్ మ్యాచ్ ఎంత రవవత్తరంగా సాగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చివరి ఓవర్ వరకు ఎవరు గెలుస్తారు అనే విషయం తెలియని ఉత్కంఠను రేపింది. రషీద్ ఖాన్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో దెబ్బకు కోల్ కతా తోక ముడిచింది. అయితే ఆ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరు రషీద్ ఖాన్ ను పొగడకుండా ఉండలేకపోతున్నారు. వ్యూహాలను రచించి మరి రషీద్ ఖాన్ హైదరాబాద్ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే సూపర్ స్టార్ మహేష్ కూడా రషీద్ కు ఫిదా అయిపోయాడు.

ఎప్పుడు లేనిది ఓ క్రికెటర్ గురించి అద్భుతంగా చెప్పి హైదరాబాద్ అభిమానులను ఆనందాన్నీ ఇచ్చాడు. రషీద్ ఖాన్ అద్భుతంగా ఆడాడు. సన్ రైజర్స్ టీమ్ కు కంగ్రాట్స్ అని ట్విట్టర్ ద్వారా మహేష్ విషెస్ అందించాడు. ఆదివారం ఫైనల్ కోసం వెయిట్ చేస్తున్నట్లు కూడా మహేష్ వివరించగా ఆ ట్వీట్ కు బౌలర్ రషీద్ ఖాన్ కూడా రిప్లై ఇచ్చాడు. థ్యాంక్యూ బ్రో.. మీ సినిమాలను బాగా చూస్తాను అని పేర్కొన్నాడు. ఇక రషీద్ నిన్నటి మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి 3 కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు 10 బంతుల్లో 34 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

  •  
  •  
  •  
  •  

Comments