హాట్ టాపిక్‌: చ‌ర‌ణ్‌-మ‌హేష్ మ‌ల్టీస్టార‌ర్‌?

Thursday, December 29th, 2016, 01:33:45 PM IST

mahesh
టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్- మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఓ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తే, అది 2017లోనే సాధ్య‌మైతే ఇంట్రెస్టింగ్ క‌దూ? ఇటు మెగా ఫ్యాన్స్, అటు ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోరూ? మ‌రి అలాంటి ప్లాన్ ఏదైనా ఉందంటారా?

ఏమో ఉందో లేదో తెలీదు కానీ ఈ ఇద్ద‌రూ మాత్రం చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌. ఆ మాట‌ను ప‌లు సంద‌ర్భాల్లో ఆ ఇద్ద‌రూ స్వ‌యంగా చెప్పారు. అయితే అనుకోకుండానే ఈ ఇద్ద‌రూ కుటుంబ స‌మేతంగా కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల కోసం వెళ్లి విదేశాల్లో క‌లిశారిలా. అప్పుడు ఓ ఫోటో కూడా దిగారు. దాన్ని చ‌ర‌ణ్ స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పిక్‌లో చ‌ర‌ణ్‌, మ‌హేష్‌ల‌తో పాటు గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా ఉన్నారు. “ఒక చిన్న సెలవులో, అన్నింటికి దూరంగా, ట్రిప్‌లో ఉన్నాం` అంటూ చ‌ర‌ణ్ పోస్టింగ్ పెట్టారు. ఈ పిక్‌ని చ‌ర‌ణ్‌, మ‌హేష్ అభిమానులు ఒక‌రికొక‌రు షేర్ చేసుకుంటూ ఆనందాన్ని వ్య‌క్తం చేసుకుంటున్నారు. ‘తనకు ఇష్టమైన హీరో మహేష్‌’ అంటూ చ‌రణ్ ప‌లు సంద‌ర్భాల్లో అంటే.. `చెర్రీ ఈజ్‌ మై బెస్ట్‌ ఫ్రెండ్‌` అంటూ మహేష్‌ కూడా అన్నారు. అందుకే ఆ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియా వ‌చ్చింది మ‌రి!

  •  
  •  
  •  
  •  

Comments