మహేష్ – సుక్కు సినిమాకు లైన్ క్లియర్ ?

Friday, June 8th, 2018, 11:08:51 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించే 25వ సినిమా నెక్స్ట్ వీక్ లో సెట్స్ పైకి రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత అయన సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీస్ నిర్మించే ఈ సినిమాకు ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయింది. తాజాగా ఈ సినిమా కథను మహేష్ సుకుమార్. కథ విన్న మహేష్ సంతృప్తి వ్యక్తం చేయడంతో సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ పై బిజీగా మారాడు. 1 నేనొక్కడినే సినిమాతో కాస్త నెగిటివ్ పరాజయాన్ని అందుకున్న ఈ క్రేజీ కాంబినేషన్ ఈ సరి మంచి హిట్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక ఈ సారి వీరిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో అన్న ఆసక్తి మహేష్ అభిమానుల్లో కలిగింది. ఈ సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కించేందుకు సిద్ధం అవుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments