భరత్ అండ్ టీమ్ ని టెన్షన్ లో పెట్టిందెవరు ?

Saturday, April 7th, 2018, 10:47:36 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమాకు సంబందించిన బహిరంగ సభ ఈ రోజు హైద్రాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకను భారీగా జరపాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి .. కానీ సినిమా యూనిట్ లో మాత్రం పెద్ద టెన్షన్ పట్టుకుంది .. అదేమిటంటే .. ప్రస్తుతం భారీగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. నిన్న పడ్డ వర్షానికే హైద్రాబాద్ అతలాకుతలం అయింది .. అలాంటిది ఈ రోజు ఈ ఈవెంట్ లో వర్షం పడితే ఏమిటి పరిస్థితి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తప్పకుండ వర్షం పడే సూచనా ఉండడంతో భరత్ అండ్ టీం ఫుల్ టెన్షన్ లో ఉన్నారట. మహేష్ ముఖ్యమంత్రి గా కనిపించనున్న ఈ సినిమా ఇప్పటికే అందరిలో ఆసక్తి క్రియేట్ చేసింది. ఖైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 20 న భారీగా విడుదల కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments