యాదగిరిగుట్టకు ..మహేష్ బాబు ?

Sunday, April 29th, 2018, 09:24:05 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా సక్సెస్ తో మంచి జోరుమీదున్నారు. ఇప్పటికే 150 కోట్ల వసూళ్లు అందుకున్న ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న టీమ్ ఇంత మంచి విజయాన్ని అందుకున్నందుకు భక్తితో పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ కనకదుర్గ అమ్మవారిని, తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న మహేష్ ఈ రోజు తెలంగాణలోని ప్రముఖ దేవాలయమైన యాదాద్రిని సందర్శిస్తున్నారు. తాజాగా మహేష్ అండ్ టీమ్ యాదాద్రి చేరుకున్నారు. ఓ వైపు లక్ష్మి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు జరుగుతున్నా వేళా మహేష్ రాకతో అయన అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్బంగా మహేష్, కొరటాల శివ స్వామి వారికీ ప్రత్యేక పూజలు చేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. మహేష్ రాకకోసం ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాట్లు నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా మహేష్ తన సినిమా విడుదల తరువాత ఇలా దేవాలయాలను దర్శించుకోవడం ఇదే ప్రధమం.

  •  
  •  
  •  
  •  

Comments