17 నుండి రెగ్యులర్ షూటింగ్ లో మహేష్ ?

Sunday, June 10th, 2018, 11:43:04 AM IST

భరత్ అనే నేను సక్సెస్ తో మంచి విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమాకు సిద్ధం అయ్యాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 17న రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. రెగ్యులర్ షూటింగ్ డెహ్రూడూన్ లో ప్రారంభం కానుంది. ఈ నెల చివరి వరకు అక్కడే షూటింగ్ జరుపుతారట. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్ లు నిర్మిస్తున్నారు. మహేష్ 25వ సినిమాగా తెరకెక్కే ఈ చిత్రంలో మహేష్ రైతుబిడ్డ గా కనిపిస్తాడని .. ఎంబీఏ చేసిన యువకుడు కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులు కనిపెడుతూ వ్యవసాయాన్ని సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో చేస్తాడట. ఈ సినిమాకు రైతుబిడ్డ అనే టైటిల్ కూడా పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో మహేష్ గడ్డం లుక్ లో కనిపిస్తాడని దానికోసం మహేష్ గడ్డాన్ని పెంచుతున్నట్టు ఇటీవలే కొన్ని ఫోటోలు లీక్ అయిన విషయం తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments