సూపర్ స్టార్ … ముఖ్యమంత్రి అయితే … ?

Saturday, November 26th, 2016, 10:53:53 AM IST

mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించే నెక్స్ట్ సినిమాలో ముఖ్యమంత్రి గా కనిపిస్తాడనే న్యూస్ హల్చల్ చేస్తుంది. ఇప్పటికే మీడియా వర్గాల్లో సంచలనం రేపుతోంది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న మహేష్ .. ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అయన ముఖ్యమంత్రి గా కనిపిస్తాడట, సామజిక ఇతివృత్తాలను తీసుకుని దానికి కమర్షియల్ హంగులు అద్ది సంచలన విజయాలు అందుకోవడంలో కొరటాల శివ స్టయిలే వెరు .. ఇప్పుడు అయన నెక్స్ట్ సినిమాలో కూడా అదే నేపథ్యంతో సినిమా రానుంది. ఆ మధ్య ‘దూకుడు’ సినిమాలో మహేష్ ఎంఎల్ఏ గా కనిపించాడు. ఇక ఈ సినిమాలో కూడా .. కథలో భాగంగానే .. అనుకోకుండా రాజకీయాల్లోకి వస్తాడని, అనూహ్యంగా ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నారు? ఊరిని దత్తత తీసుకోమని ‘శ్రీమంతుడు’ సినిమాతో చెప్పిన మహేష్ .. మరి ఈ సినిమాతో ఎలాంటి మెసేజ్ ఇస్తాడో చూడాలి !! డిసెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి రానుందట.