ఆ హీరో మహేష్ బాబు ఫ్రెండా?

Thursday, April 12th, 2018, 09:37:37 AM IST

ప్రస్తుతం మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న భరత్ అనే నేను మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆ సినిమాపై అంచనాలు భారిగా ఉన్నాయి. శ్రీమంతుడు రికార్డులను ఈ సినిమా తప్పకుండా తిరగరాస్తుందని ఇప్పటికే సినీ ప్రముఖులు కామెంట్స్ చేశారు. ఇకపోతే మహేష్ 25వ సినిమాను కూడా మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆ సినిమాను ఎక్కువగా అమెరికాలోనే షూట్ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ కకూడా నటించనున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. అల్లరోడు అందులో మహేష్ బాబు స్నేహితుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక మహేష్ సరసన పూజ హెగ్డే – అల్లరి నరేష్ కు జోడిగా షాలిని పాండే నటించనున్నారు. దిల్ రాజు – అశ్వినీదత్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు.