మిమ్మల్ని చూసి మేము చాలా గర్వపడుతున్నాం : మహేష్

Saturday, April 14th, 2018, 05:32:17 PM IST

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఘనత రాజమౌళిదని బల్ల గుద్ది చెబుతున్నారు ఆయన అభిమానులు. ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే నిన్న ప్రకటించిన 65వ జాతీయ చలన చిత్ర అవార్డులలో బాహుబలికి మూడు అవార్డులు వచ్చాయి. ఈ క్రమంలో రాజమౌళికి , బాహుబలి టీంకి శుభాకాంక్షలు చెబుతూ పలువురు సెలబ్రిటీలు ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ కూడా అభినందనలు తెలియజేశారు. జాతీయ చలన చిత్ర అవార్డులలో ఘన విజయం సాధించినందుకు అభినందనలు..ఇండియన్ సినిమాకి బాహుబలి చత్రం ఓ మైలు రాయి వంటిది. మిమ్మల్ని చూసి మేము చాలా గర్వపడుతున్నాం అని ట్వీట్ చేశాడు మహేష్.

సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20న విడుదల కానుండగా, ఈ మూవీకి భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తందనే కాన్ఫిడెంట్ తో ఉంది టీం. ఇక దర్శక ధీరుడు రాజమౌళి త్వరలో ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.