ట్రెండింగ్ :మెకానిక్ మహేష్ బాబు!

Friday, February 16th, 2018, 05:35:58 PM IST

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కొత్త తరహా కథలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇదివరకు ఆయన నాని, నిజం, వన్ వంటి చిత్రాలతో ప్రయోగాలు చేశారు కూడా. అయితే ప్రస్తుతం ఆయన అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ తో కలసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన కారు మెకానిక్‌ గా నటిస్తున్నట్లు సమాచారం.
మహేష్‌ని దృష్టిలో ఉంచుకొనే సందీప్ ఈ కథని సిద్ధం చేసుకొన్నాడని, ఆ కథని కూడా ఇప్పటికే వినిపించాడని ప్రచారం సాగుతోంది. అన్నీ కుదిరితే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా మహేష్‌కి చాలా బాగా నచ్చడంతో ఆయన చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపిన విషయం విదితమే. ఓ మెకానిక్‌ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని ఈ పాత్రే సినిమాకు కీలకమని వార్తలు వెలువడుతున్నాయి. మహేశ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖలేజా’ చిత్రంలో మహేశ్‌ టాక్సీ డ్రైవర్‌ పాత్రలో నటించారు. మరిప్పుడు మెకానిక్‌ గా నటిస్తున్నారంటే ఆయన మంచి మాస్ చిత్రం లో చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘భరత్‌ అనే నేను’ చిత్రంలో నటిస్తున్నారు. కైరా అద్వాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో పాటు మహేశ్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనూ నటిస్తున్నా విషయం తెలిసిందే……