మహేష్ బాబు అందులోను నెంబర్ వన్నే!

Wednesday, July 25th, 2018, 09:13:14 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలుగువారికి పరిచయం అవసరం లేదు. తండ్రి కృష్ణ గారి నట వారసత్వంతో చిన్నతనంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు, హీరోగా నటించిన తొలి చిత్రం రాజకుమారుడుతో సూపర్ సక్సెస్ అందుకునారు. ఆ తరువాత అనతికాలంలోనే సూపర్ స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో నెంబర్ వన్ స్థానానికి అతిచేరువలో వున్న వారిలో ఆయన కూడా ఒకరు అని చెప్పకతప్పదు. అయితే ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలు అలానే ఫ్యామిలీకి సంబందించిన విషయాలను పోస్ట్ చేస్తూ వుంటారు. ఇక ప్రస్తుతం ఆయన ఒక అద్భుత రికార్డును నెలకొల్పినట్లు సమాచారం అందుతోంది.

అది ఏంటంటే ఈ సంవత్సరంలో ఫేమస్ కమ్యూనికేషన్ సంస్థ వికీపీడియాలో అత్యధికంగా ఏ సెలబ్రిటీ గురించి నెటిజన్లు వెతికారు అనే దానిమీద ఒక సర్వే నిర్వహించగా అందులో మహేష్ బాబు టాలీవుడ్ హీరోలు అందరిలో నెంబర్ అనేగా నిలిచారట. ఈ ఏడాది జనవరి 1నుండి ఇప్పటివరకు సూపర్ స్టార్ మహేష్ బాబు వికీ పీడియా పేజీని సగటున రోజుకు 6400 మంది వీక్షిస్తున్నారట. ఇప్పటికే సౌత్ ఇండియన్ స్టార్లలో అత్యధిక బ్రాండ్లకు ప్రచారకర్తగా వున్న హీరో అయిన మహేష్ బాబు కెరీర్ లో ఈ విధంగా మరొక ఘనత వచ్చిచేరిందని తెలుస్తోంది. మహేష్ బాబు ఇప్పటివరకు టాలీవుడ్ సినిమాలు తప్ప మరి ఏ ఇతర చిత్రాలు చేయనప్పటికీ కూడా ఒకరకముగా జాతీయ స్థాయి నటుడికి వున్న గుర్తింపు ఆయనకు దక్కుతుందని చెప్పవచ్చు……

  •  
  •  
  •  
  •  

Comments