ప్రీమియర్ షో టాక్ : ‘భరత్ అనే నేను’

Friday, April 20th, 2018, 01:06:30 PM IST

 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో, కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా ఫస్ట్ ఓత్ దగ్గరనుండి మొన్న ఆడియో, అలానే ట్రైలర్ విడుదల వరకు సినిమా పై అంచనాలు రోజురోజుకు మరింత పెరిగాయి. అయితే మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. నేడు విడుదల కానున్న ఈ సినిమా యుఎస్ ఏ, దుబాయ్, ఖతార్ ల లో ప్రదర్శితమైన ప్రీమియర్ షో టాక్ ప్రకారం సినిమాకు అన్ని చోట్ల నుండి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నట్లు త్లెలుస్తోంది. అలానే బాలీవుడ్ సినీ విమర్శకుడు ఉమైర్ సందు కూడా ఈ సినిమా అద్భుతమని, మహేష్ బాబు శ్రీమంతుడు తర్వాత మరొక ఇండస్ట్రీ హిట్ కొట్టాడని తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.

ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్స్ ని బట్టి చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడ బోర్ కొట్టకుండా జాగ్రత్తగా నడిపించాడట దర్శకుడు. అలానే ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుందని తెలుస్తోంది. ఇక సెకండ్ హాఫ్ అయితే మంచి కాన్సెప్ట్ తో వుంది అని, ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల కోసం వచ్చే ఫైట్స్ అద్భుతమని చూసినవారు అంటున్నారు. అంతే కాదు సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ సన్నివేశం లో మహేష్ బాబు నటన, పలికే డైలాగులు అదరహో అనేలా వున్నాయట. ప్రీ క్లైమాక్స్ సీన్, అలానే క్లైమాక్స్ ఫైట్ సీన్ బాగుందని తెలుస్తోంది. ఇక సినిమాలో పాటలు కూడా సందర్భానుసారం వచ్చాయని ముఖ్యంగా భరత్ అనే నేను టైటిల్ సాంగ్, వచ్చాడయ్యో సామి సాంగ్స్ ఆడియన్స్ కి కన్నులపండుగేనని సమాచారం. మొత్తంగా వెరసి సెకండ్ హాల్ఫ్లో అక్కడక్కడా చిన్న లాగ్ లు తప్పించి, మహేష్ బాబు తన అభిమానులకి సూపర్ హిట్ చిత్రం అందించినట్లు తెలుస్తోంది. అయితే పూర్తి సంక్షిప్త రివ్యూ కోసం మా నేటిఏపీ వెబ్ సైట్ చూస్తూ వుండండి…..

  •  
  •  
  •  
  •  

Comments