మహేష్ ముఖ్యమంత్రిగా కన్పించేది కొద్దిసేపు కాదట ?

Thursday, April 19th, 2018, 01:18:05 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా ముఖమంత్రి పాత్రలో నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు విడుదలకు సిద్ధం అయింది. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా ఓ రేంజ్ లో జరిగింది. ఇక మహేష్ బాబు ముఖ్యమంత్రి గా కనిపిస్తాడన్న న్యూస్ తెలిసినప్పటినుండి అయన అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

అయితే ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించేది కొద్దీ సేపు కాదట .. దాదాపు సినిమా మొత్తంగా కనిపిస్తాడని ఆయనే చెప్పేసాడు. సినిమా మొదలైన పదినిమిషాలకే ముఖ్యమంత్రి పాత్ర ఎంట్రీ ఇస్తుందని తెలిసింది. సో మహేష్ అభిమానులకు నిజంగా ఇది పండగ అని చెప్పాలి. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 200 కోట్ల వసూళ్లు సాదిస్తుందని ట్రేడ్ వార్తలు భావిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments