సినిమాలు లేకుంటే యాడ్స్ చేసి ఇల్లు కట్టుకున్నా : మహేష్ బాబు

Wednesday, September 27th, 2017, 08:57:38 PM IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. ఒక్కడు తర్వాత మహేష్ కి అసలు స్టామినా బయటపడింది. కరెక్ట్ గా ఆయనకు తగ్గట్టు కథలు రావడంతో స్టార్ హోదాను పొందారు. మహేష్ కూడా ఒక కథను చెయ్యాలా వద్దా అని ఒకటికి పది సార్లు ఆలోచించుకుంటారు. ఆ తరహాలోనే అలోచించి మంచి బాక్స్ ఆఫీస్ హిట్స్ ను అందుకున్నారు.

అయితే తన సినిమాలకు ఈ స్థాయిలో మార్కెట్ ఎలా వచ్చిందో తనకే అర్ధం కావడం లేదని అంటున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమా మార్కెట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.
బ్రహ్మోత్సవం లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత తీసిన స్పైడర్ రూ.150 కోట్ల వరకు ప్రీ – రిలీజ్ జరిగింది. అసలు నాకు తెలియకుండానే నా సినిమా ఈ స్థాయికి పెరిగిందని చెప్పాడు. అలాగే ఇతర సినిమాలు అపజయం చెందినప్పుడు కూడా తనకు మంచే జరిగిందని ముఖ్యంగా కోట్ల రూపాయలను సంపాదించానని చెప్పాడు. పోకిరి హిట్ తర్వాత మూడేళ్ల వరకు ఏ సినిమా చేయలేదు. గ్యాప్ లేకుండా 12 యాడ్స్ చేసి కోట్లు సంపాదించి ఒక ఇల్లు కట్టుకున్నానని తెలిపాడు. ఇక ముందు కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి కథాంశంతో భారీ బడ్జెట్ సినిమాలు వస్తే తప్పకుండా చేస్తానని అంటున్నాడు మహేష్.

  •  
  •  
  •  
  •  

Comments