పవన్ కళ్యాణ్ – మహేష్ వర్సెస్ రాజమౌళి.. మొదట ఎవరితో ?

Tuesday, September 26th, 2017, 09:06:07 AM IST


కొన్ని కాంబినేషన్స్ సెట్అయితే బావుంటుందని ప్రేక్షకులు చాలా అనుకుంటారు. ఆ కాంబో లో సెట్ అయితే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కూడా బద్దలవ్వాల్సిందే. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు. కుర్రకారుకి వీరి సినిమాలంటే చాలా ఇష్టమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మహేష్ బాబు సాధారణంగా అప్ కమింగ్ డైరెక్టర్స్ తో కన్నా సీనియర్ దర్శకులతో హిట్స్ ఫామ్ లో ఉన్న దర్శకులతో సినిమాలు చేస్తారనే టాక్ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ అయితే త్రివిక్రమ్ తో తప్ప ఎక్కువగా సీనియర్ దర్శకుల దగ్గరికి వెళ్లరు. అయితే ఇటువంటి స్టార్స్ తో దర్శకదీరుడు రాజమౌళి సినిమా తీస్తే బావుంటుందని ఎప్పటినుంచో అందరు అనుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా ఇష్టపడే జక్కన్న – కె.విజయేంద్ర ప్రసాద్ ఇప్పటివరకు అధికారికంగా సినిమా తీస్తామని చెప్పలేదు. కొన్ని రూమర్స్ వచ్చినా వారు వాటిపై స్పందించలేదు. ఇక మహేష్ విషయానికి వస్తే రాజామౌళి ఇదివరకే మహేష్ తో తీద్దామని అనుకున్నారట కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదని తెలుస్తోంది. ఇక రీసెంట్ గా మహేష్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. స్పైడర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళితో సినిమా ప్రస్తావన రాగానే ఈ విధంగా స్పందించారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అయిపోగానే ఆయనతో చేస్తానని, తప్పకుండా రాజమౌళి తో సినిమా చేస్తానని చెప్పారు. అంటే ప్రస్తుతం భారత్ అనే నేను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఆ సినిమా అయిపోగానే వంశీ పైడిపల్లి తో ఓ సినిమాకు ఒకే చేశారు. ఈ రెండు సినిమాలు అయిపోతే రాజమౌళి – మహేష్ కాంబినేషన్ పై ఓ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పవచ్చు.

  •  
  •  
  •  
  •  

Comments