వీడియో :సితార నోట సీఎం భరత్ పాట

Monday, April 30th, 2018, 11:46:08 AM IST

సూప‌ర్ స్టార్ మహేష్ త‌న‌య సితార ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌నక్క‌ర్లేదు. ఎప్పుడూ ఎదో ఒక అల్లరి చేస్తూ ఇల్లంతా గోల గోల చేస్తుంది. త‌న తండ్రి సినిమాలోని పాట‌ల‌కు స్పెప్పులేయ‌డ‌మే కాదు, డైలాగుల‌ను కూడా ముద్దుగా ముద్దుగా ప‌లుకుతుంది. ఇక మ‌హేష్ మూవీ షూటింగ్ లొకేష‌న్ కి వెళ్లి అక్కడ సితార చేసే సంద‌డి టీం మెంబ‌ర్స్ కి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇటివల కొర‌టాల శివ తెర‌కెక్కించిన భ‌ర‌త్ అనే నేను మూవీ సెట్స్‌కి కూడా వెళ్ళిన సితార అక్క‌డ ఫుల్ హంగామా చేయ‌డంతో పాటు యూనిట్ స‌భ్యుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించింద‌ట‌. ఇక త‌న తండ్రి ప్ర‌తి సినిమాలో ఏదో ఒక‌ డైలాగ్ లేదా సాంగ్‌ని కంఠ‌స్తం చేసే సితార తాజాగా భ‌ర‌త్ అనే నేను చిత్రం కోసం దేవి శ్రీ ప్ర‌సాద్ స‌మ‌కూర్చిన ఇది క‌ల‌ల ఉన్న‌దే అనే సాంగ్‌ని పాడి వినిపించింది. సితార ప‌ర్‌ఫార్మెన్స్ మ‌హేష్ అభిమానుల‌ని అల‌రిస్తుంది. సితార వీడియో కూడా వైర‌ల్ అయింది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ న‌టించిన భ‌ర‌త్ అను నేను చిత్రం పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో రూపొందిన సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments