ఫ్యామిలీతో మహేష్ … ఫారెన్ టూర్ ?

Friday, May 4th, 2018, 11:24:21 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఎక్కడ చుసిన సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక తన సినిమాల విషయంలో బిజీగా షూటింగ్ చేసే మహేష్ షూటింగ్ గ్యాప్ లో ఫ్యామిలి తో కలిసి విదేశాలకు వెళ్లడం మనం చూస్తున్నదే. భరత్ అనే నేను సినిమా పూర్తయ్యాక విదేశాలకు వెళ్లొచ్చి .. మళ్ళీ విడుదల ముందు ఆ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నాడు. ఇక సినిమా సక్సెస్ తరువాత మళ్ళీ ఫ్యామిలి తో కలిసి విదేశాలకు వెళ్ళాడు .. వచ్చాక వంశీ పైడిపల్లి సినిమాలో నటించనున్నాడు. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలి ప్యారిస్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తుంది, నిన్నే అయన విదేశాలకు వెళ్లిపోయారు.

Comments