మహేష్ బాబు ఫస్ట్ లుక్ అదుర్స్!

Friday, January 26th, 2018, 10:08:19 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న నూతన చిత్రానికి ‘భరత్ అనే నేను’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం 7 గంటలకు, టైటిల్ లోగో ను అలానే మహేష్ బాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆడియో ప్రోమో ని రిలీజ్ చేశారు. విడుదలయిన నిముషంనుండి మహేష్ అభిమానులు సోషల్ మీడియా లో వీటిని లైక్ లు, షేర్ లు చేస్తూ పండుగ చేసుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే కొరటాల శివ అప్పుడే అయిపోలేదు ఉదయం 9 గంటలకు అభిమానులకు మరొక సర్ప్రైజ్ ఉందని ట్వీట్ చేయడంతో ఏమి రిలీజ్ చేస్తారా అని అందరిలోను ఒకటే ఉత్కంఠ. అయితే చివరకు మహేష్ బాబు స్టైలిష్ ముఖ్యమంత్రి గా బ్యాగ్ పట్టుకుని నడుచుంటూ వస్తున్న స్టిల్ ఒకటి రిలీజ్ చేశారు. ఇది కూడా ఇప్పుడు టాక్ అఫ్ ది మిడియా అయింది. మొత్తానికి ఇవాళ మహేష్ అభిమానులకు ఆయన సినిమా భరత్ అనే నేను ఫస్ట్ లుక్ పోస్టర్, మరియు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న డైలాగ్స్ ఒకేసారి రిలీజ్ కావడంతో పెద్ద పండుగే అని చెప్పవచ్చు…