మహేష్ అమెరికా వెళుతున్నాడు .. ఎందుకో తెలుసా ?

Monday, October 30th, 2017, 11:12:19 AM IST

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం భరత్ అను నేను హైద్రాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షెడ్యూల్ లో వారం రోజుల పాటు గ్యాప్ రావడంతో మహేష్ అమెరికాకు చెక్కేస్తున్నాడు? మహేష్ సినిమా షూటింగ్ గ్యాప్ దొరికితే ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళుతుంటాడు అని అనుకుంటున్నారా ? అది నిజమే కానీ .. ఇప్పుడు అయన వెళ్ళేది హాలిడేస్ కోసం కాదు .. షూటింగ్ కోసం !! అవునా ఏ సినిమా షూటింగ్ అని షాక్ అవుతున్నారా .. మహేష్ వెళుతున్నది సినిమా షూటింగ్ కోసం కాదు . థమ్స్ అప్ యాడ్ కోసం !! ఇప్పటికే మహేష్ థమ్స్ అప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. అక్కడే మూడు రోజుల పాటు థమ్స్ అప్ యాడ్ షూటింగ్ లో పాల్గొని వస్తాడట. ఆ తరువాత మళ్ళీ కొరటాల శివ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడట. అది విషయం.

  •  
  •  
  •  
  •  

Comments