మహేష్ + బాలయ్య + బోయపాటి.. అతిత్వరలో..?

Sunday, October 29th, 2017, 12:56:24 PM IST

ఈ మధ్య తెలుగు పరిశ్రమలో మల్టీ స్టారర్ చిత్రాలకు గిరాకీ బాగా పెరిగింది. చిన్న హీరోలు చేసే మల్టీ స్టారర్ సినిమాల్ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్న నైపథ్యంలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఇలాంటి సినిమానే చేయనున్నారు. ఆ స్టార్లు మరెవరో సీనియర్ స్టార్ హీరో నందమయూరి బాలకృష్ణ, మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. అవును.. అసలు ఊహకు కూడా అందని ఈ కాంబినేషన్ త్వరలోనే స్క్రీన్ మీద కనబడబోతోందట. ఈ భారీ ప్రాజెక్టును స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తారని వినికిడి.

ఇప్పటికే తనకు రెండు హిట్లు ఇచ్చిన బోయపాటి అంటే బాలయ్యకు చాలా నమ్మకం, అంతేగాక మహేష్ బాబు కూడా బోయపాటితో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఈ రెండు అవకాశాలతో బోయపాటి ఈ మల్టీ స్టారర్ ను సెట్ చేశారట. ఈ ఇద్దరు హీరోలు బోయపాటి చెప్పిన కథను కూడా ఓకే చేశారట.

అయితే మహేష్ ప్రస్తుతం కొరటాల శివతో ‘భరత్ అనే నేను’ చేస్తూనే అది పూర్తయ్యాక వంశీ పైడిపల్లితో 25వ సినిమాను చేయనున్నారు. అలాగే బాలయ్య కూడా 102 వ సినిమా ‘జై సింహా’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇలా ఇద్దరు హీరోలకున్న కమిట్మెంట్స్ పూర్తై ఈ ప్రాజెక్ట్ మొదలవడానికి 2018 అవుతుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టును ఎవరు నిర్మిస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు.