మహేష్ టైటిల్ పై ఫాన్స్ అన్ హ్యాపీ !!

Friday, September 30th, 2016, 12:29:02 PM IST

mahesh
మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమాకు ”అభిమన్యుడు” అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫిలిం వర్గాల్లో ఈ టైటిల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది, ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ రాకపోయినా ఈ టైటిల్ పై మహేష్ ఫాన్స్ మాత్రం హ్యాపీ గా లేరట !! కొంపదీసి ‘అభిమన్యుడు’ టైటిల్ పెడతారేమేమో అంటూ .. షాక్ అవుతున్నారు, మరో వైపు ఈ టైటిల్ పెట్టొద్దని అంటున్నారు .. ? ఇంతకీ ఫాన్స్ ఈ టైటిల్ విషయంలో ఎందుకంత విచారంగా ఉన్నారు? అంటే గతంలో ఈ పేరుతొ వచ్చిన సినిమాలన్నీ హిట్ అయినా దాఖలాలు లేవు. 80 వ దశకంలో శోభన్ బాబు హీరోగా వచ్చిన ”అభిమన్యుడు” సినిమా ప్లాప్ అయింది, అలాగే ఆ మధ్య కళ్యాణ్ రామ్ హీరోగా ”అభిమన్యు” పేరుతొ మరో సినిమా వచ్చింది, అదికూడా భారీ ఫ్లాప్? కాబట్టి ఈ టైటిల్ లో నెగిటివ్ ఎక్కువగా ఉంది కాబట్టి .. ఈ టైటిల్ పెట్టొద్దనే ఉద్దేశంలో ఉన్నారు ఫాన్స్ ..!! మరి ఫాన్స్ మాట విని ఈ టైటిల్ మారుస్తారో లేక ఇదే టైటిల్ పెడతారో చూడాలి ? మరో వైపు ఈ చిత్రానికి ”ఏజెంట్” అనే టైటిల్ పెడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ టైటిల్ పై క్లారిటీ రావాలంటే దసరా వరకు ఆగాల్సిందే ?