మహేష్ సినిమాకి అదిరిపోయో టైటిల్..!

Wednesday, September 28th, 2016, 02:10:25 AM IST

mahesh-babu
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ చెన్నై లో బిజీగా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ సినిమాకు క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారో అని జనాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జస్టిస్, న్యాయం కావాలి వంటి రకరకాల టైటిల్స్ వినిపించాయి .. అయితే ఫైనల్ గా ఈ సినిమాకు టైటిల్ ఓకే అయినట్టు తెలుస్తోంది ? ఈ సినిమాకు టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే, ఇంతకీ ఆ టైటిల్ ఏమిటో తెలుసా … ”అభిమన్యుడు” !! అవును అన్యాయాలను ఎదుర్కొనేందుకు పోరాడిన అభిమన్యుడి స్ఫూర్తి తో ఈ సినిమా ఉంటుందని, అందుకే ఆ టైటిల్ ఓకే చేస్తున్నట్టు తెలిసింది. ఈ టైటిల్ తో దసరా రోజున ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారట !! మరి అభిమన్యుడిగా మహేష్ ఎలా అదరగొట్టనున్నాడో చూడాలి ?