త్వరలో మహేష్ అల్లుడు స్క్రీన్ ఎంట్రీ!

Saturday, January 13th, 2018, 03:43:07 PM IST

త్వరలో టాలీవుడ్ కి మరో స్టార్ హీరో బంధువు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతను ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు అల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్. ప్రస్తుతం ఈ హీరో ఎంట్రీ గురించి చర్చలు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఈ హీరోను దిల్ రాజు తన ప్రొడక్షన్ లో పరిచయం చేయబోతున్నాడట. అందుకు ఒక కథను కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం. హరి అనే కొత్త దర్శకుడు ఒక మంచి కాన్సెప్ట్ స్టోరీని రెడీ చేసుకోగా దాన్ని దిల్ రాజు గల్లా జయదేవ్ తో తీయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే మహేష్ ఫ్యామిలీ నుంచి సుదీర్ బాబు ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో సినిమాలను చేస్తున్నారు. ఇప్పుడు అశోక్ కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక సినిమా చూపిస్త మావ నిర్మాత బెక్కం వేణుగోపాల్ కూడా సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసి దిల్ రాజు అధికారికంగా సినిమాపై ఒక వివరణ ఇస్తారని సమాచారం.