ఆ దర్శకుడే కావాలంటున్న మహేష్ .. నిర్మాతల టెన్షన్ ?

Monday, November 6th, 2017, 02:15:13 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విషయంలో బాగా స్పీడ్ పెంచాడు. అప్పట్లో ఒక సినిమాకోసం ఏకంగా రెండేళ్ల టైం తీసుకునే మహేష్ ఈ మధ్య ఆరునెలల్లో షూటింగ్ పూర్తీ చేసి నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే 24వ చిత్రంగా కొరటాల శివ సినిమాలో నటిస్తున్నాడు మహేష్. ప్రస్తుతం హైద్రాబాద్ లో వేసిన ముఖ్యమంత్రి ఛాంబర్ సెట్స్ లో ఈ షూటింగ్ జరుగుతుంది. దాంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా, త్రివిక్రమ్ దర్శకత్వంలో 26 వ సినిమాలకు కమిట్ అయ్యాడు. తాజాగా తన 27వ సినిమా గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తో తెరకెక్కించేందుకు నిర్మాతలు గట్టి ప్రయత్నాలు చేస్తుండగా .. మహేష్ మాత్రం సుకుమార్ తో చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. పైగా నిర్మాతలకు కూడా అదే విషయం చెప్పడంతో వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే అక్కడ మహేష్ తో సినిమా చేస్తామని బోయపాటి శ్రీను కు మాట ఇవ్వడంతో వాళ్ళు సందిగ్ధం లో పడ్డారు. 1 నేనొక్కడినే సినిమా తరువాత మళ్ళీ సుకుమార్ తో సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడు మహేష్. అందుకే తన 27వ సినిమాను సుకుమార్ తోనే సెట్ చేయమని చెప్పాడట. తన ఫేవరేట్ బ్యానర్ అయినా 14 రీల్స్ నిర్మించే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Comments