మహేష్ రొమాంటిక్ కిస్ చూశారా ?

Sunday, April 22nd, 2018, 01:10:56 PM IST

బ్రహ్మోత్సవం – స్పైడర్ లాంటి వరుస అపజయాల తరువాత మహేష్ కసి మీద హిట్ కొట్టాలని చేసిన ప్లాన్ ఎట్టకేలకు వర్కౌట్ అయ్యింది. ఫైనల్ గా భరత్ అనే నేను సినిమాతో కెరీర్ లో గుర్తుండిపోయే మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పటికే సినిమా 100 కోట్ల గ్రాస్ అందుకుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అమెరికాలో అయితే నాన్ బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసింది. 2 మిలియన్ల డాలర్లను వసూలు చేసి మహేష్ కెరీర్ లో గుర్తుండిపోయే విజయాన్ని ఈ సినిమా అందించింది.

దీంతో మహేష్ ఆనందానికి ఇప్పుడు అవధులు లేకుండా పోయాయి. తన కుటుంబ సభ్యులతో కలిసి మహేష్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా మహేష్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక స్పెషల్ పిక్ వచ్చింది. ఆయన నమ్రతతో ముద్దు పెట్టుకుంటున్న ఆ ఫొటో వైరల్ అవుతోంది. మహేష్ మంచి రొమాంటిక్ పర్సన్ అంటూ ఎవరి స్టైల్ లో వారు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మహేష్ థ్యాంక్యూ మై లవ్ అనే కామెంట్ కూడా పెట్టాడు.

  •  
  •  
  •  
  •  

Comments