నా పూర్తి జీవితం సినిమాలకే అంకితం : మహేష్ బాబు

Friday, April 27th, 2018, 07:33:58 PM IST

తాజాగా వచ్చిన మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా హిట్ అయినందున అభిమానులతో కలిసి సినిమా చూడడానికి విజయవాడ వెళ్ళిన బ్మహేష్ సినిమా థియేటర్ లో అభిమానులతో ఇలా మాట్లాడాడు. తనకు వందేళ్లు వచ్చే వరకు సినిమాల్లోనే నటిస్తానని, రాజకీయ తెరంగేట్రం చేయనని టాలీవుడ్ యాక్టర్ అన్నాడు. మహేశ్ విజయవాడలోని ఓ థియేటర్ లో డైరెక్టర్ కొరటాల శివతో కలిసి సినిమా చూశాడు. అనంతరం డీవీ మానర్ హోటల్‌లో గుండె చికిత్స పూర్తయిన చిన్నారులతో మహేశ్‌బాబు కొద్దిసేపు ముచ్చటించాడు.
ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ..ఒక్కడు, పోకిరి, దూకుడు విజయోత్సవ సభలు విజయవాడలోనే నిర్వహించినట్లు చెప్పాడు. భరత్ అనే నేను చిత్రానికి ఘన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పాడు. విజయవాడకు రావడం చాలా సెంటిమెంట్‌గా ఫీలవుతానన్నాడు మహేశ్. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments