థ్యాంక్స్ కేటీఆర్ గారు : మహేష్ బాబు

Friday, April 27th, 2018, 10:49:17 AM IST

మహేష్‌బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భరత్ అనే నేను చిత్రానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇటీవ‌ల ఈ సినిమాను వీక్షించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. హీరో మహేష్‌బాబు, దర్శకుడు కొరటాలశివను ప్రత్యేకంగా అభినందించారు. తన మిత్రుడు మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివతో నిర్వహించిన స్నేహపూర్వక సమావేశంలో భరత్ అనే నేను సినిమాతో పాటు ప్రజాజీవితాన్ని గురించి కేటీఆర్ చ‌ర్చించారు. కేటీఆర్ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని, చిత్రబృందంతో ఆయన పంచుకున్న అనుభవాల్ని ఇంటర్యూ రూపంలో త్వరలో ఓ వీడియో ద్వారా విడుద‌ల చేయ‌నున్నారు. భరత్ అనే నేను చిత్రాన్ని వీక్షించిన కేటీఆర్‌కు మహేష్‌బాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక‌ ఈ స్పెష‌ల్ కార్య‌క్ర‌మం కోసం చేనేత వ‌స్త్రాలు మాకు ప‌రిచ‌యం చేసినందుకు ధ‌న్య‌వాదాలు. నేను ప్రోగ్రాంలో ధ‌రించిన ష‌ర్ట్‌పై బోలెడ‌న్ని కాంప్లిమెంట్స్ వ‌స్తున్నాయి. ఈ ష‌ర్ట్ ఎంతో కూల్‌గా ఉండ‌డంతో పాటు స్టైలిష్‌గా, క‌మ్‌ఫర్ట‌బుల్‌గా నా శ‌రీరాకృతికి త‌గ్గ‌ట్టుగా ఉంది అని మ‌హేష్ త‌న ట్వీట్ ద్వారా తెలిపారు. దీనిపై స్పందించిన కేటీఆర్ చేనేత ప్ర‌మోష‌న్స్ నా హృదయానికి ద‌గ్గ‌రైంది. ఇందుకు స‌పోర్ట్ ఇచ్చిన మ‌హేష్‌, కొర‌టాల శివ‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.. మీ ఫ్యూచ‌ర్‌ సినిమాల‌లో చాలా స్టైలిష్ మ‌రియు సౌక‌ర్య‌వంత‌మైన హ్యాండ్లూమ్స్‌ని ఉప‌యోగిస్తార‌ని ఆశిస్తున్నాను అని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి మ‌హేష్‌, కొర‌టాల త‌ప్ప‌కుండా చేస్తామ‌ని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments