మహేష్ కోసం సుకుమార్ 150 కోట్ల ప్లానింగ్!

Thursday, September 6th, 2018, 12:28:49 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమాతో హిట్ అందుకున్నాడు అంటే చాలు ఆ తరువాత వచ్చే సినిమాల తాలూకు అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. భరత్ అనే నేను సినిమాతో మంచి హిట్ అందుకున్న మహేష్ నెక్స్ట్ మహర్షి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో హీరోగా 25వ సినిమా కావడంతో దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ సుకుమార్ తో కలవనున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ కాంబినేషన్ లో తెరకెక్కే ప్రాజెక్టుకు భారీ ఖర్చు కానుందట. మైత్రి మూవీ మేకర్స్ సినిమాను నిర్మించనుంది. ఇప్పటికే కథను పూర్తి చేసుకున్న సుకుమార్ ప్రొడక్షన్ ప్లానింగ్ గురించి చర్చలు జరుపగా దాదాపు 150 కోట్ల వరకు బడ్జెట్ గ్రాఫ్ వచ్చిందని సమాచారం. నిర్మాతలు కూడా ఈ క్రేజీ కాంబో కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్దపడుతున్నారని తెలుస్తోంది. రంగస్థలం సినిమా ద్వారా సుకుమార్ ఫుల్ ఫార్మ్ లోకి వచ్చేశాడు. ఇక మహేష్ తో కూడా అదే దూకుడను కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. ఇదివరకు మహేష్ సుక్కు కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments