డోన‌రుడితో మ‌హేష్‌బాబుకి లింకేంటంటే!

Tuesday, September 27th, 2016, 01:16:15 PM IST

naruda
మ‌హేష్‌బాబు అంద‌రితో బాగుంటాడు. కానీ ఆయ‌నకి ద‌గ్గ‌రి స్నేహితులు మాత్రం చాలా త‌క్కువ‌. తెలుగు క‌థానాయ‌కుల్లో మ‌హేష్‌కి క్లోజ్ ఫ్రెండ్ అంటే సుమంతే. వాళ్లిద్ద‌రి కెరీర్ ఇంచుమించు ఒకేసారి మొద‌లైంది. ఆ అనుబంధంతోనే సుమంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `న‌రుడా డోన‌రుడా` ట్రైల‌ర్‌ని మ‌హేష్‌బాబు ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశాడు. నా డియ‌రెస్ట్ ఫ్రెండ్సు మంత్ న‌టించిన చిత్రం ట్రైల‌ర్ ఇదే అంటూ కొద్దిసేప‌టి క్రిత‌మే ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశాడు. హిందీలో విజ‌య‌వంత‌మైన `విక్కీ డోన‌ర్‌`కి రీమేక్‌గా తెర‌కెక్కిన చిత్ర‌మే `న‌రుడా డోన‌రుడా`. సుమంత్‌కి స‌రైన సినిమా ప‌డి చాలా కాల‌మైంది. ఈ సినిమాతోనైనా హిట్టు కొట్టాల‌ని ఆయ‌న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. అందుకే ప్ర‌మోష‌న్వ్య‌ వ‌హారాల్ని కూడా త‌నే ద‌గ్గ‌రుండి చూసు కొంటున్నాడు. సినిమాపై గ‌ట్టి న‌మ్మ‌కముండ‌టంతో త‌న‌కి హిట్టు ఇచ్చేది ఇదే అని న‌మ్ముతున్నాడాయ‌న‌. త్వ‌ర‌లోనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.