మహేష్ 25వ సినిమా టైటిల్ అదేనా?

Tuesday, May 29th, 2018, 04:49:07 PM IST

భరత్ అనే నేను సినిమాతో కెరీర్ లో గుర్తుండిపోయే హిట్ అందుకున్న మహేష్ బాబు నెక్స్ట్ కూడా అదే తరహాలో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అది కూడా కెరీర్ లో 25వ చిత్ర కావడంతో అభిమానుల్లో అంచనాలు కూడా చాలా పెరిగిపోయాయి. అందుకే దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమా కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వచ్చే నెల సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అసలు మ్యాటర్ లోకి వస్తే రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ గురించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది.

సినిమాలో మహేష్ లుక్ లో చాలా మార్పులు కనిపిస్తాయట. స్టైలిష్ మహారాజు లా కనిపిస్తాడని అందుకే ‘రాజసం’ అనే టైటిల్ పెట్టె ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వంశీ పైడిపల్లి మొదటి నుంచి ఇదే టైటిల్ అనుకుంటున్నప్పటికీ నిర్మాత దిల్ రాజు ఇంకా ఒకే చెప్పలేదని టాక్. ఈ సినిమాకు సి.అశ్వినీదత్ కూడా సహా నిర్మాతగా వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు ఎండ్ అయ్యాయి. మరి కొన్ని రోజుల్లో చిత్రీకరణ కోసం ఈ గ్యాంగ్ యూఎస్ బయలుదేరనుంది. ఇక సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే నటిస్తుండగా హీరో స్నేహితుడిగా అల్లరి నరేష్ నటించనున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments