మహేష్ మనసు గెలుచుకున్న రెండవ వ్యక్తి ఆయనే!

Friday, April 27th, 2018, 05:10:41 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు. తెలుగు వారికి అసలు పరిచయం అవసరం లేని పేరు. లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి నటవారసత్వంతో చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చిన మహేష్ బాబు, రాజకుమారుడుతో 1999లో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆయన కొన్ని ఇండస్ట్రీ హిట్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల విడుదలయిన ఆయన తాజా చిత్రం భరత్ అనే నేను, సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఎప్పడు హంగులు ఆర్భాటాలకు దూరంగా వుండే మహేష్ బాబు, మాటల్లో కూడా కొంత పొదుపరి.

అయితే ఇటీవల మాత్రం తన శైలి మార్చుకుని అందరితోనూ కలిసిపోతున్నారు. అంతే కాక ఆయన అభిమానులతో ఎప్పికప్పుడు తన అప్ డేట్స్ తెలియచేయడానికి 2010లో ట్విట్టర్ లో ఖాతా తెరిచారు. అయితే ఒక గమ్మత్తయిన విషయం ఏమిటంటే, ఆయనలానే మన హీరోలు హీరోయిన్ లలో చాలా మందికి ట్విట్టర్ ఖాతా వుంది. అయితే వారు పలువురు లెజెండరీ యాక్టర్లు, ఇతర నటులను ఫాలో అవుతున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం ఈ ఎనిమిది సంవత్సరాల్లో కేవలం ఆయన బావ గల్లా జయదేవ్ ని మాత్రమే ఫాలో అవుతున్నారు. అయితే మొత్తానికి ఇన్నాళ్లకు మరొక వ్యక్తిని కూడా ఫాలో అవుతున్నారు. అయన మరెవరో కాదు శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాల దర్శకుడు కొరటాల శివ.

కొన్నాళ్లక్రితం ఈ విషయమై మహేష్ మాట్లాడుతూ, తన మనసుకు బాగా దగ్గరయ్యే వారిని మాత్రమే తాను ఫాలో అవుతాను అని చెప్పకనే చెప్పారు. అంటే కొరటాల మహేష్ మనసు గెలిచారు అనే కదా అర్ధం. ఇదివరకు శ్రీమంతుడు హిట్ అయినపుడు ఆయనకు కార్ ఇచ్చిన మహేష్ బాబు, కొరటాలకు అంతకు మించి ఇచ్చిన ఈ పలువురు మహేష్ ఫాన్స్ ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు……