161 కోట్లకు జీఎస్టీ క‌ట్టారా సీఎం సార్‌?

Friday, April 27th, 2018, 09:22:41 PM IST

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ – కొర‌టాల కాంబినేష‌న్ మూవీ `భ‌ర‌త్ అనే నేను` క‌లెక్ష‌న్ల హ‌వా సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. నేటితో రెండోవారంలోకి అడుగుపెట్టింది. బ్లాక్‌బ‌స్ట‌ర్ .. బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్.. రికార్డులు బ్రేక్ అంటూ డివివిఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌ చేస్తున్న హంగామా చూస్తుంటే నిర్మాత దాన‌య్య ఏ రేంజులో హ్యాపీసో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఓవైపు డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో పార్టీలు, మ‌రోవైపు స‌క్సెస్ యాత్ర పేరుతో ఏకంగా మ‌హేష్‌నే యాత్ర‌ల‌కు తిప్పుతూ ఆ రేంజులో ఉంది ప్ర‌మోష‌న్‌.

ప‌నిలో ప‌నిగా రెండో వారంలో అడుగుపెట్టాం అని ప్ర‌క‌టిస్తూ .. తొలి వారం 161 కోట్ల గ్రాస్ వ‌సూలు చేశామంటూ ప్ర‌క‌టించేశారు. అదీ పోస్ట‌ర్‌పై 161.28 కోట్ల గ్రాస్ అంటూ ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. అంతా బాగానే ఉంది కానీ… నిర్మాత‌ దాన‌య్య ఆ మొత్తానికి జీఎస్టీ క‌ట్టారా? అంటూ ఒక‌టే అభిమానుల్లో ముచ్చ‌ట సాగుతోంది. జీఎస్టీ రూల్ వ‌చ్చాక అంతా వైట్‌లోనే సాగుతోంది కాబ‌ట్టి క‌ట్టే ఉంటారులే అని ప‌రాచికాలు ఆడుతున్నారు. సినిమా ఇండ‌స్ట్రీపై ప‌న్ను పోటు ఓ రేంజులోనే ఉంది. జీఎస్టీ పేరుతో 25శాతం వ‌ర‌కూ ట్యాక్స్ క‌ట్టాల్సి ఉంటుంది. మ‌రి అంత పెద్ద మొత్తం క‌ట్టారా సీఎం భ‌ర‌త్ సారూ? దాన‌య్య సారూ? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రు. అన్న‌ట్టు .. `భ‌ర‌త్ అనే నేను` ఓవ‌ర్సీస్‌లో `రంగ‌స్థ‌లం` వ‌సూళ్ల‌ను అందుకునే సీన్ లేద‌న్న ఖండ‌న వినిపిస్తోంది. మ‌రోవైపు 161 కోట్ల గ్రాస్ అంటూ పోస్ట‌ర్ వేసి, ఇప్ప‌టికే 150 కోట్ల షేర్ వ‌సూళ్ల క్ల‌బ్‌లో చేరామ‌ని సిగ్న‌ల్స్ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే కాస్తంత వ‌సూళ్ల లెక్క గంద‌ర‌గోళంగా ఉంద‌ని ప‌లువురు అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments