150 కోట్ల మార్కెట్ సాధించిన సీఎం భరత్

Saturday, April 28th, 2018, 09:26:53 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించి ఆకట్టుకుంటున్న చిత్రం భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి వసూళ్లను రాబట్టి సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అందరి ప్రశంశలు అందుకుంటూన్నది. ఇక ఓవర్ సీస్ లోను క్రేజీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా 150 కోట్ల మార్కెట్ క్రోస్ చేసింది. ఇప్పటికే 161 కోట్ల వసూళ్లతో అటు రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు పోటీగా మారింది. అయితే ఈ సినిమా వసూళ్ల పై ఐపీఎల్ ఎఫెక్ట్ కూడా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఐపీఎల్ లేదంటే కలక్షన్స్ ఇంకా పెరిగేవని టాక్. మరి భరత్ అనే నేను మొదటి వారంలో వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం .. షేర్ లలో ..

నైజాం – 14. 30 కోట్లు,
సీడెడ్ – 6. 95 కోట్లు,
వైజాగ్ – 6. 06 కోట్లు,
ఈస్ట్ – 5. 52 కోట్లు,
వెస్ట్ – 3. 30 కోట్లు,
కృష్ణా – 4. 60 కోట్లు,
గుంటూరు – 6. 80 కోట్లు,
నెల్లూరు – 1. 95 కోట్లు,
ఆంధ్రా – 28. 80 కోట్లు,
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కలిపి – 50. 14 కోట్లు,
యూ ఎస్ – 10 . 23 కోట్లు,
కర్ణాటక – 6. 08 కోట్లు,
రెస్ట్ అఫ్ వరల్డ్ – 4. 08 కోట్లు,
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా కలిపి – 71. 86 కోట్లు.

  •  
  •  
  •  
  •  

Comments