ప్రపంచ వ్యాప్తంగా 2వ స్థానంలో మహేష్ టీజర్!

Friday, March 23rd, 2018, 12:46:47 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం అందరి చూపు మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాపైనే ఉంది. సినిమాకు సంబందించిన ఎటువంటి న్యూస్ అయినా కూడా వైరల్ అవుతోంది. ముఖ్యంగా సినిమా టీజర్ సృష్టించిన రికార్డ్ గురించి తెలిస్తే ఎవ్వరైన షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే మొన్నటి వరకు దేశంలోనే అత్యధిక లైకులు అందుకున్న చిత్రంగా యూట్యూబ్ లో నిలిచింది. ఇక ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే రెండవ స్థానంలో నిలవడం నిజంగా చాలా స్పెషల్ అని చెప్పాలి. శ్రీమంతుడు తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ చేస్తోన్న ఈ సినిమా కోసం పరభాషా అభిమానులు కూడా చాలానే ఎదురుచూస్తున్నారు.

టీజర్ లో మహేష్ ని చూసి చాలా మంది మురిసిపోయారు. ముఖ్యమంత్రి పాత్రలో చాలా బావున్నాడని పాజిటివ్ కామెంట్స్ అందాయి. ఇక ప్రపంచంలో హాలీవుడ్ మూవీ కెప్టెన్‌ అమెరికా: సివిల్‌ వార్’ ను ఎక్కువ మంది లైక్ చేశారు. ఇంతవరకు దానికి వచ్చిన లైక్స్ 6,58,000. ఇక భరత్ అనే నేను సినిమాకు వచ్చిన లైకులు 6,40,000. హాలీవుడ్ సినిమాకు మహేష్ సినిమాకు వచ్చిన లైకుల్లో పెద్దగా వ్యత్యాసం లేదని ఈజీగా అర్ధమవుతోంది. సూపర్ స్టార్ క్రేజ్ రిజల్ట్ తో సంబంధం లేకుండా పెరుగుతోందని చెప్పడానికి ఇదొక ఉదాహరణం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రికార్డ్ తో సోషల్ మీడియాలో ‘BAN 2nd most liked teaser in world’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది.