తమిళంలో విడుదలవుతున్న మహేష్ అట్టర్ ప్లాప్ సినిమా ?

Monday, December 4th, 2017, 12:18:30 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఎలాంటిదో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా తెలుసు .. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న మహేష్ ఈ మద్యే స్పైడర్ సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాకపోయినా మహేష్ మీదున్న క్రేజ్ తో బాగానే ఆడింది. ప్రస్తుతం కోలీవుడ్ లో మహేష్ అంటే మంచి క్రేజ్ ఏర్పడ్డ నేపథ్యంలో అయన నటించిన సినిమాలను డబ్ చేసి క్యాష్ చేసుకుందామని కొందరు నిర్మాతలు తెగ ప్రయత్నాలు మొదలు పెట్టారు .. ఈ నేపథ్యంలో మహేష్ గత ఏడాది నటించిన బ్రహ్మోత్సవం సినిమాను తమిళంలో అనిరుద్ పేరుతొ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో అట్టర్ ప్లాప్ సినిమాగా నిలిచింది. మరి ఇంత కష్టపడి ఈ సినిమాను డబ్బింగ్ చేసి తమిళంలో విడుదల చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి .. ఇప్పటికే మహేష్ సినిమాలకోసం తమిళ నిర్మాతలు అన్వేషణలు మొదలు పెట్టారు. మరి అనిరుద్ గా తమిళ ప్రేక్షకులను మహేష్ ఆకట్టుకుంటాడా లేదా అన్నది చూడాలి !!

  •  
  •  
  •  
  •  

Comments