రజినీకాంత్ కోసం వెనుకడుగు వేసిన బన్నీ – మహేష్ ?

Tuesday, December 5th, 2017, 12:39:24 PM IST

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో వస్తోన్న 2.0 సినిమా కోసం ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకోవడంతో ఆ టైమ్ లో నిర్మాతలు వారి సినిమాలు రిలీజ్ కాకుండా ఉండాలని చూసుకుంటున్నారు. ఒక్క కోలీవుడ్ టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే 2018 ఏప్రిల్ 27న అల్లు అర్జున్ – నా పేరు సూర్యా అలాగే మహేష్ బాబు – భరత్ అనే నేను సినిమాలు ఒకేసారి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి.

కానీ ఇప్పుడు అదే సమయంలో రజినీకాంత్ – 2.0 సినిమా వస్తుండడంతో స్టార్ హీరోలు వారి సినిమా రిలీజ్ డేట్స్ ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. భరత్ అనే నేను సినిమాను నిర్మాత దానయ్య ఏప్రిల్ 13న రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారట. ఇక అల్లు అర్జున్ సినిమా కూడా 2.0 కంటే ముందే ఏప్రిల్ 20న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా రిలీజ్ చేస్తే మూడు సినిమాలు వాటి స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటాయి అని సినీ పండితులు భావిస్తున్నారు. మరి ఈ సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటాయో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments