భరత్ కు అక్కడ బాగానే వర్కవుట్ అయిందిగా?

Wednesday, May 9th, 2018, 10:15:20 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివల కాంబినేషన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ లో 190 కోట్ల వరకు వసూళ్లు అందుకున్న ఈ సినిమా అటు తమిళంలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళంలో తెలుగు వెర్షన్ మాత్రమే విడుదలైంది. అయినా సరే మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కూడా భారీగా వసూళ్లు దక్కించుకుని సంచలనం రేపింది. స్పైడర్ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ అంటే కోలీవుడ్ లోకూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ సినిమా వస్తుందంటే అక్కడి అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. వచ్చే సినిమాల విషయంలో కోలీవుడ్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి చాలా రోజుల తరువాత కోలీవుడ్ లో మహేష్ జెండా పాతినట్టే !!

Comments