షాక్ …మహేష్ వెబ్ సిరీస్ చేస్తున్నాడా ?

Saturday, September 15th, 2018, 10:53:58 PM IST


అంటే అవుననే సమాధానం వస్తుంది !! సూపర్ స్టార్ వెబ్ సిరీస్ చేయడం ఏమిటి ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజమే .. కాలం మారుతున్నా కొద్దీ మనం మారాల్సి ఉంటుంది .. మార్పులు అన్నది ఇక్కడ సహజమే. ఒకప్పుడు టివి లంటే జనాలకు పెద్దగా ఆసక్తిగా ఉండేది కాదు .. కానీ ఇప్పుడు టీవీలను వదిలి పెట్టడం లేదు. పూర్తీ స్థాయి ఎంటర్ టైన్మెంట్ ను టివిల ద్వారా తీసుకుంటున్నారు జనాలు. ఇక టీవీలతో పాటు ఇప్పుడు వెబ్ కూడా ఓ పెద్ద ప్లాట్ ఫార్మ్ గా మారింది. సోషల్ మీడియా ఇప్పటికే జనాలను అట్రాక్ట్ చేసింది. దాంతో సోషల్ మీడియాతో పాపులర్ అయ్యేందుకు వెబ్ సిరీస్ లో మొదలయ్యాయి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ తో పాటు హాలీవుడ్ స్టార్స్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇండియాలో అయితే కొన్ని వెబ్ సిరీస్ లు సంచలనం రేపాయి కూడా. తెలుగులో ఈ మద్యే జగపతి బాబు మెయిన్ లీడ్ లో నటించిన గ్యాంగ్ స్టార్స్ మంచి క్రేజ్ తెచ్చుకున్న నేపథ్యంలో ఇప్పుడు పలువురు స్టార్స్ వెబ్ సిరీస్ లలో నటించేందుకు రెడీ అయ్యారు .. తాజాగా ఈ లిస్ట్ లో మహేష్ బాబు పేరు వినిపిస్తుంది. మహేష్ తో ఓ క్రేజీ వెబ్ సిరీస్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ నిర్మించే ఈ సిరీస్ కోసం మహేష్ భార్య నమ్రత తో చర్చలు జరుపుతున్నారట. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments