స్పైడర్ లో మహేశ్ స్టైల్ మిస్ అయ్యిందా? సాంగ్స్ లో సైడ్ ఎఫెక్ట్!

Wednesday, September 27th, 2017, 06:36:35 PM IST


సూపర్ స్టార్ మహేశ్ అంటేనే స్టైలిష్ కి ఐకాన్ లా ఉంటాడు. అతను ఎలాంటి కాస్ట్యూమ్ వేసిన దానికి కొత్త లుక్ వస్తుంది. అలాగే ఆయన ప్రతి సినిమాలో కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. శ్రీమంతుడు సినిమాలో చూసిన, బ్రహ్మోత్సవం సినిమాలో అతని లుక్ ఎంత స్టైలిష్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతని స్టైలిష్ లుక్ వలెనే మహేష్ కి లేడీస్ ఫాలోయింగ్ కూడా ఉంది. అలాగే సినిమాలో అతని డ్రెస్సింగ్ స్టైల్ ని కూడా అందరు ఇష్టపడతారు.

అయితే స్పైడర్ సినిమాలో పాటలలో మహేశ్ కాస్ట్యూమ్ చూసిన తర్వాత చాలా మంది నిరుత్సాహానికి గురవడం జరుగుతుంది. ఈ సినిమాలో అతను చాలా వరకు స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడు. అయితే పాటలకి వచ్చేసరికి డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా గాడితప్పుతుంది. పాటల్లో ఉపయోగించిన కాస్ట్యూమ్స్ చాలా వరకు మహేశ్ లుక్ ని డిస్టర్బ్ చేసే విధంగా ఉన్నాయి. మురుగదాస్ సాంగ్స్ ని చాలా రిచ్ గా పిక్చరైజ్ చేసిన అందులో మహేశ్ లుక్ లో మాత్రం వైబ్రేషన్ లేకపోవడం అతని ఫ్యాన్స్ ని కాస్తా అసహనానికి గురిచేస్తుంది. ఇది వరకు సినిమాలతో పోల్చుకుంటే మహేశ్ స్పైడర్ సినిమా పాటల్లో అతని డ్రెస్సింగ్ స్టైల్ అంతగా ఆకట్టుకోలేదని ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న మాట. మరి మురుగదాస్ ఎ పాయింట్ అఫ్ వ్యూ లో ఆ సాంగ్ కోసం మహేశ్ డ్రెస్సింగ్ స్టైల్ లో ఆయా సాంగ్స్ లో ప్రెజెంట్ చేసాడో అనేది అతనికే తెలియాలి.

  •  
  •  
  •  
  •  

Comments