మల్టిప్లెక్స్ రంగంలోకి మహేష్ .. త్వరలోనే స్టార్ట్ ?

Tuesday, September 4th, 2018, 09:43:59 PM IST

ఈ మధ్య సినిమా స్టార్ కేవలం సినిమాల్లోనే కాకుండా అటు బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ అందుకుంటున్నారు. ఇప్పటికే పలువూరు స్టార్స్ ఈ పలురకాల బిజినెస్ లలో ఉన్న విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ఇప్పటికే రామ్ చరణ్, నాగార్జున, శర్వానంద్, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, నితిన్, సందీప్ కిషన్ లు పలు రకాల బిజినెస్ లలో బిజిగాన్ ఉన్నారు. మరికొందరు స్టార్ అటు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో బిజీగా ఉన్నారు. తాజాగా బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్.

ఇప్పటి వరకు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఓ రేంజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న అయన ఇప్పుడు మల్టి ప్లెక్స్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహేష్ భారీ రేంజ్ లో ఈ మల్టిప్లెక్స్ బిజినెస్ మొదలు పెడతారట. హైదరాబాద్ లోని గచ్చిబౌలి తో పాటు అటు ఆంధ్రా లో అమరావతి, వైజాగ్ లను అయన ఎంపిక చేసాడట. ఈ ప్రాంతాల్లో మోడరన్ విదేశీ స్టైల్ లో మల్టిప్లెక్స్ ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం పై ఫిలిం నగర్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. సో త్వరలోనే ఈ బిజినెస్ గురించి మహేష్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయట.

  •  
  •  
  •  
  •  

Comments