పెళ్లిచేసుకోబోతున్న మహేష్ హీరోయిన్?

Tuesday, May 8th, 2018, 03:51:58 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుతో 1 నేనొక్కడినే చిత్రంలో జోడి కట్టిన బాలీవుడ్ భామ కృతి సనన్ త్వరలో తన ప్రియుణ్ణి పెళ్లిచేసుకోనున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిజానికి బాలీవుడ్ లో ప్రేమపెళ్లిళ్లు కామన్ అని ఇటీవల విరాట్, అనుష్క శర్మ ఇక నేడు సోనమ్, ఆనంద్ అహుజాలు కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కృతి సనన్ చేసుకోబోతోంది మరి ఎవరినోకాదు, కాయ్ పో చే చిత్రంతో బాలీవుడ్ లో ప్రవేశించిన సుశాంత్ సింగ్ రాజపుట్ ని అట. ఆ తరువాత శుద్ దేశి రొమాన్స్, ఎమ్ ఎస్ ధోని, ఇటీవల విడుదలైన రాబ్తా వంటి చిత్రాల్లో నటించాడు సుశాంత్. కాగా రబ్తాలో తనతో జోడికట్టిన కృతితో అతను ప్రేమాయణం సాగిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే వీటికి వూతం ఇచ్చేటట్లు సుశాంత్ ఒక అమ్మాయి చేయి పట్టుకుని దిగిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసాడు. అంతే కాదు ఆ అమ్మాయి ఎవరో త్వరలో వెల్లడిస్తాను అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అంతే ఆ చేయి కృతిదే అని పలు మీడియా చానెల్స్, పత్రికలు వారిద్దరి ప్రేమపై కథనాలు ప్రసారం చేశాయి. ఈ వార్తలో ఎంత నిజం ఉందొ తెలియదుకాని, వీరిద్దరి ప్రేమకు రెండు కుటుంబాలు ఒకే చెప్పాయని, కొద్దిరోజుల్లో పెళ్లిపై ప్రకటన అధికారికంగా వెలువడుతుందని సమాచారం……

Comments