జై సింహా కూడా అజ్ఞాతంలోకే : కత్తి మహేష్

Friday, January 12th, 2018, 12:22:13 PM IST

యువరత్న నందమూరి బాల కృష్ణ హీరోగా ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ , సి కె ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వం లో చేసిన జైసింహ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల కోలాహలం మధ్య బ్రహ్మానందంగా విడుదలయి మంచి టాక్ సంపాదించింది. ఈ చిత్రం పై ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ తన రివ్యూ ని తెలియచేసారు. అదేంటో చూద్దాం.
80 ల కథ కి, 90 ల కధనం, గతిలేని కథ. గతిలేని కథనం, వెరసి ఒక కలగూరగంపగా జైసింహ చిత్రం ఉందన్నారు. నిరర్ధక కధలో ఒక అసంబద్ధమైన పాత్రలో బాలయ్య, ఎందుకు ఉన్నామో తెలియని ముగ్గురు హీరోయిన్ లు, మొత్తానికి అజ్ఞాతంలోకి మరొక సినిమా అని ఆయన అన్నారు. రాబోవు రోజుల్లో ఈ చిత్రం ఏమేర కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాలి.