మహేష్ – కోరటాల సినిమా విడుదల ఆ పండగ కే :

Thursday, November 10th, 2016, 10:52:54 AM IST

mahesh-koratala-siva
మహేశ్ కొత్త సినిమా మొదలైపోవడం తో ఫుల్ హ్యాపీగా ఉన్నారు మహేష్ అభిమానులు. మురగదాస్ తో కొత్త సినిమా చేస్తున్న మహేష్ దీని తరవాత కొరటాల శివ తో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పూజా కార్యక్రమాలు పూర్తి చేసి ముహూర్తం షాట్ కూడా తీసేశారు. ఈ సినిమా విడుదల గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి. నవంబర్ తొలి వారం లో ముహూర్తం అయితే పెట్టేసారు కానీ సినిమా షూటింగ్ మొదలు అయ్యేది జనవరి చివ్వర్లోనే . మురగదాస్ ఇప్పటికే సినిమా చాలా నెమ్మదిగా తీసున్నాడు అది కంప్లీట్ అవ్వడానికి టైం పట్టేలానే ఉంది. మురుగదాస్ సినిమా షూటింగ్ ను పూర్తిగా కంప్లీట్ చేశాక.. కొరటాలతో కలుస్తాడు సూపర్ స్టార్. దిల్ చాహ్తా హై.. రంగ్ దే బసంతి వంటి చిత్రాలకు కెమేరా సేవలు అందించిన సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్.. కొరటాల-మహేష్ తో కలిసి వర్క్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరాకు తెరపైకి తీసుకురానున్నారని అంటున్నారు. సెప్టెంబర్ చివర్లో దసరా పండుగ రానుండగా.. ఆ సమయానికల్లా మహేష్ బాబు- కొరటాల శివల మూవీ.. థియేటర్లలో ఉటుందట.