షాకింగ్ న్యూస్ : బిగ్ బాస్ షోలో హోస్ట్ గా మహేష్…

Saturday, April 7th, 2018, 02:58:57 PM IST

హిందీలో స‌ల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన‌ బిగ్ బాస్ రియాలిటీ షోకి అత్యంత ప్ర‌జాద‌ర‌ణ ల‌భించిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌మిళం, తెలుగు భాష‌ల‌లోను ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు నిర్వాహ‌కులు. బిగ్ బాస్ షోకి త‌మిళంలో క‌మ‌ల్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా, తెలుగులో ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా ఉన్నారు. ప‌లువురు సెల‌బ్రిటీల‌తో సాగే ఈ గేమ్ షో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. అయితే తెలుగులో బిగ్‌బాస్ షో సెకండ్ సీజ‌న్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది. నాని ఈ కార్య‌క్ర‌మానికి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌ని అంటున్నారు. అయితే మ‌రాఠీలోను బిగ్ బాస్ షోని మొద‌లు పెట్టాల‌ని భావిస్తున్నారు. దీనికి వ్యాఖ్యాత‌గా అదుర్స్ చిత్రంలో ఎన్టీఆర్ విల‌న్‌గా క‌నిపించిన మ‌హేష్ మంజ్రేక‌ర్ ఉంటారు. ఏప్రిల్ 15 నుండి సీజ‌న్ 1 ప్రారంభం కానుంది. మ‌రి బిగ్ బాస్ హౌజ్‌లో ఎంట‌ర‌య్యే కంటెస్టెంట్‌లు ఎవ‌రుంటారు, హౌజ్‌లో ఏం జ‌ర‌గ‌బోతుంది అనే విష‌యాలు తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మ‌హేష్ మంజ్రేక‌ర్ ప్ర‌స్తుతం తెలుగులో సాహో అనే చిత్రం చేస్తున్నాడు. సాహో చిత్రం ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతుండ‌గా, ఈ చిత్రాన్ని సుజీత్ తెర‌కెక్కిస్తున్నాడు.