మహేష్ సినిమా ఫస్ట్ లుక్ రావడం లేదా ?

Monday, January 23rd, 2017, 11:31:38 AM IST

mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ విడుదల కాలేదు. ఈ సినిమా టైటిల్ ఏమిటనే విషయం పై ఇంకా సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ నెల 26న విడుదల అవుతుందని అనుకున్నారు కానీ ఈ సినిమాకు సంబందించిన ఒక్క న్యూస్ కూడా బయటికి రావడం లేదు. ఫస్ట్ లుక్ కోసం మహేష్ ఫాన్స్ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. వారికి నిరాశ కలిగించే విషయం ఏమిటంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటిలో వచ్చే ఛాన్స్ లేదని తెలిసింది. సినిమా షూటింగ్ కి కూడా ఇంకా సమయం పెట్టె అవకాశాలు ఉన్నాయి. పైగా సినిమా కూడా జూన్ లో విడుదల చేస్తారట. అందుకే ఫస్ట్ లుక్, టైటిల్ అన్నౌన్స్ మెంట్ మార్చ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.